మైనింగ్ యాప్​తో అక్రమాలకు చెక్ : పట్నం మహేందర్ రెడ్డి

మైనింగ్ యాప్​తో అక్రమాలకు చెక్ : పట్నం మహేందర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు :  టీఎస్ ఈమైనింగ్ మొబైల్ యాప్ ను మంత్రి పట్నం మహేందర్ రెడ్డి  ఆవిష్కరించారు. శనివారం సెక్రటేరియేట్​లో ఈ కార్యక్రమం జరిగింది. కొత్త యాప్ ద్వారా గనులు, ఇసుక, ఖనిజ రవాణా తనిఖీలు, అక్రమార్కులకు అడ్డుకట్ట వేయవచ్చని మంత్రి తెలిపారు. ఈ -  చలాన్ పద్ధతితో  జరిమానాలను ఆన్లైన్లో వసూలు చేసేందుకు వీలుంటుందన్నారు.

పారదర్శకత, వెంటనే రుసుము వసూలు చేయడానికి అనుమతులు ఇవ్వవచ్చునని చెప్పారు. యాప్​ను రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ, జాతీయ సమాచార విజ్ఞాన కేంద్రం (ఎన్ఐసీ) హైదరాబాద్ సంయుక్తంగా డెవలప్​మెంట్​చేశారు. కార్యక్రమంలో సీఎస్​ శాంతి కుమారి, డీఎంజీ కాత్యాయినీ దేవి పాల్గొన్నారు.