టెన్షన్లున్నా.. అటెన్షన్ గానే ఉంటా..!

టెన్షన్లున్నా.. అటెన్షన్ గానే ఉంటా..!
  • పనిచేయని అధికారులకే బీపీ తెప్పిస్తా 
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి కామెంట్

వరంగల్ సిటీ, వెలుగు: ఎన్ని టెన్షన్లు ఉన్నా.. అటెన్షన్ గానే ఉంటానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర వేడుకల్లో భాగంగా శుక్రవారం వరంగల్ ఖుష్ మహల్ వద్ద వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని మంత్రి సందర్శించారు.  ఆయనకు ఏఎన్ఎం ప్రణీత బీపీ చెక్ చేయగా నార్మల్ గానే ఉంది. దీంతో ఎన్ని టెన్షన్లు ఉన్నా.. నాకు బీపీ ఉండదు. పని చేయని అధికారులకే బీపీ తెప్పిస్తా” అంటూ మంత్రి పొంగులేటి నవ్వుతూ వెళ్లిపోయారు. ఆయన కామెంట్స్ తో అక్కడే ఉన్న కలెక్టర్ సత్యశారద, మేయర్ సుధారాణి, కమిషనర్ చాహత్​ బాజ్​పాయ్, ఎంపీ కడియం కావ్య , వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, వరంగల్​ డీఎంహెచ్ వో సాంబశివరావు నవ్వుల్లో మునిగారు.