తెలంగాణలో ధరణి పోర్టల్ ను రద్దు చేసి త్వరలో ROR( రికార్డ్ ఆఫ్ రైట్స్) చట్టం తీసుకొస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అక్టోబర్ నెలాఖరులోగా కొత్త చట్టం అమల్లోకి తెస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రివ్యూచేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించామని చెప్పారు. ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటామన్నారు.
గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్స్ ను గాలికి వదిలేసిందన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పూర్తయిన ఇండ్లను దసరా లోపు అందజేస్తామని చెప్పారు. వెంటనే మరమ్మత్తులు చేసి మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 నుంచి 4 వేల డబుల్ బెడ్కూం ఇండ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షాల సలహాలు సూచనలు స్వీకరిస్తామన్నారు.