
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కర్ణాటక తరహాలో లైసెన్స్ డ్ సర్వేయర్ల విధానం తెస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఐదు వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను తీసుకోబోతున్నామని తెలిపారు. ఇందుకోసం మే 17వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు . అర్హులైన వారిని ఎంపిక చేసి తెలంగాణ సర్వే శిక్షణ అకాడమీలో శిక్షణ ఇస్తామని అన్నారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేలా భూ లావాదేవీలను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో 6000 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లు ,4000 మందిప్రభుత్వ సర్వేయర్లు సేవలందిస్తున్నారని ఒక్కో లైసెన్స్‌డ్ సర్వేయర్ కు నెలకు సగటున 23 దరఖాస్తులు వస్తాయని దీని ద్వారా అతనికి నెలకు 25 వేల నుండి 30 వేల ఆదాయం వస్తుందని తెలిపారు. లైసెన్స్‌డ్ సర్వేయర్లు నిర్వహించి, రిజిస్ట్రేషన్ కు ముందు స్కెచ్ తయారుచేసి పోర్టల్లో అప్ లోడ్ చేస్తారు. వీరిపనులను ప్రభుత్వసర్వేయర్లు పరిశీలించి, సంబంధిత అధికారి (AD, S&LR) ఆమోదిస్తారు. ఈ పథకంద్వారా భూలావాదేవీలు మరింత సమర్థవంతంగా, శాస్త్రీయంగా సాగుతున్నాయని అధికారులు వివరించారు.
Also Read : తెలంగాణలో మరో 5 రోజులు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో శాశ్వతంగా భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకమై భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు పొంగులేటి. ఈ భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియకు భూమి సర్వే మ్యాపును జత పరచడం తప్పనిసరి చేసిన నేపధ్యంలో ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ విధానం అమలు జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో ఆయా మండలాల్లో భూలావాదేవీలు, భూ విస్తీర్ణాన్ని బట్టి సర్వేయర్లను నియమించాలని అధికారులకు సూచించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.