అశోక్ ఆర్టీసీ డ్రైవర్ కాదు..అద్దె బస్సు డ్రైవర్ : మంత్రి పొన్నం 

అశోక్ ఆర్టీసీ డ్రైవర్ కాదు..అద్దె బస్సు డ్రైవర్ : మంత్రి పొన్నం 

హైదరాబాద్, వెలుగు: జగిత్యాలలో రైతుల పక్షాన ప్రశ్నించిన అశోక్ అనే డ్రైవర్ ను ఉద్యోగం నుంచి తొలగించారని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని రవాణా మంత్రి  పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అతడు ఆర్టీసీ ఉద్యోగి కాదని, ఆర్టీసీకి నడుపుతున్న అద్దె బస్సు డ్రైవర్ మాత్రమేనని మంగళవారం హైదరాబాద్ లో మీడియాకు తెలిపారు. అయినా అతన్ని ఉద్యోగం నుంచి తొలగించవద్దని ఆ బస్సు యాజమాన్యానికి సూచించానని పొన్నం వివరించారు.

అశోక్ రైతుల పక్షాన మాట్లాడారు, దాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. కేంద్రం ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని, అయినప్పటికీ కొనుగోళ్లు సాఫీగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేయవద్దని మంత్రి పొన్నం కోరారు.