
రాజీవ్ గాంధీ బతికి ఉంటే సైన్స్ అండ్ టేక్నాలజీలో దేశం మరింత పరుగులు పెట్టేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేశం మరింత అభివృద్ధి పథంలో ముందు కెళ్లేదని చెప్పారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సోమాజీగూడలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు పొన్నం.
ఈ సందర్బంగా మాట్లాడిన పొన్నం.. రాజీవ్ గాంధీ కళ, సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందాలని. రాజీవ్ గాంధీ కృషితో సెలఫోన్ వచ్చింది. 18 ఏళ్లకు ఓటు హక్కు కలిపించారు. దేశం కోసం కృషి చేస్తూ సర్వం త్యాగం చేశారు గాంధీ కుంటుంబం. పదవి వ్యామోహంలో మోదీ, అమిత్ షా ఎంతకైనా దిగజారుతారు. పదవి కోసం ఓట్లు దొంగిలించారు. మోదీ అక్రమ మార్గంగా ప్రధాని అయ్యారు. సోనియా, రాహుల్ గాంధీ పదవి వదులు కున్నారు. నెహ్రు, గాంధీ లేగసి మరిపించేవిధంగా కుట్ర చేస్తున్నారు. యువత చరిత్ర చదవాలి. కుట్రలను తిప్పి కొట్టాలి అని విమర్శించారు పొన్నం.
రాజీవ్ గాంధీ జయంతి, వర్ధంతి కార్యక్రామలు వీహెచ్ ప్రతి యేటా నిర్వహిస్తారని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. భారతదేశాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత, ఐటి రంగానికి పునాదులు వేసిన మార్గదర్శి.. రాజీవ్ గాంధీ. నిరుపేదలకు అండగా నిలిచిన మహానేత. మారుతున్న కాలం అనుగుణంగా,సాంకేతికత అంకురార్పణం చేసిన ఘనత రాజీవ్ గాంధీ. గ్రామీణ ప్రాంతాల్లో నేరుగా నిధులు అందేవిధంగా చేయూతనిచ్చారు. అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఘనత రాజీవ్ గాంధీకి సొంతం అని పొన్నం అన్నారు.