
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వానలు పడుతున్నప్పుడు బయటికి రావొద్దని హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్, విద్యుత్ శాఖల ఆఫీసర్లు సమన్వయం చేసుకోవాలని సూచించారు.
3 రోజుల్లో పడాల్సిన వర్షం 30 నిమిషాల కన్న తక్కువ సమయంలో కుంభవృష్టిగా పడుతుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. అత్యవసరమైతేనే ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలన్నారు. సిటీలోని మ్యాన్‌హోల్స్ వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ సిబ్బందిని ఆదేశించారు.