గిరిజన గ్రామాల అభివృద్ధికి రూ.9.75 కోట్లు : పొన్నం ప్రభాకర్

గిరిజన గ్రామాల అభివృద్ధికి రూ.9.75 కోట్లు :  పొన్నం ప్రభాకర్
  • మంత్రి పొన్నం ప్రభాకర్ 

హుస్నాబాద్, వెలుగు: అక్కన్నపేట మండలంలోని గిరిజన గ్రామాల అభివృద్ధికి గిరిజన సంక్షేమ శాఖ నిధుల కింద రూ.9.75 కోట్లు మంజూరైనట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా అంతర్గత సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణానికి ఈ నిధులు కేటాయించామన్నారు. పంతులు తండా-ధరావత్ తండా సీసీ రోడ్డు, పంతులు తండా-పిక్కు తండా సీసీ రోడ్డు, తుక్కి తండా-నందారం బీటీ రోడ్డు, పంజాగుట్ట తండా క్రాస్-రాజు తండా బీటీ రోడ్డు, అక్కన్నపేట-నర్సింగ్ తండా సీసీ రోడ్డు, అక్కన్నపేట-గోవర్ధనగిరి వయా బోడిగపల్లి ఆర్ అండ్​బీ రోడ్డు నిర్మాణాలు చేయనున్నట్లు చెప్పారు. పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయించి కృషి చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్​కు అక్కన్నపేట మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.