రానున్న రోజుల్లో ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ ఆర్ లోపల ..ఎలక్ట్రిక్​, ఎల్పీజీ, సీఎన్జీ వెహికల్స్‌‌‌‌‌‌‌‌కు మాత్రమే : పొన్నం ప్రభాకర్

రానున్న రోజుల్లో ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ ఆర్ లోపల ..ఎలక్ట్రిక్​, ఎల్పీజీ, సీఎన్జీ వెహికల్స్‌‌‌‌‌‌‌‌కు మాత్రమే : పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, వెలుగు: రాబోయే రోజుల్లో ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోపల కేవలం ఈవీ, ఎల్పీజీ, సీఎన్జీ వాహనాలను మాత్రమే అనుతించే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ మరో ఢిల్లీ కాకూడదనే ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నామని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఓ హోటల్‌‌‌‌‌‌‌‌లో బజాజ్ గోగో కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ ఆటోలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. 

దేశంలోనే మొదటిసారి అన్ని రకాల ఈవీ వాహనాలకు లైఫ్ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ను రద్దు చేశామని, దీంతో ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోయినా, రాబోయే రోజుల్లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను పర్యావరణహిత సిటీగా నిలబెట్టేందుకు, ఇక్కడి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. హైదరాబాద్ సిటీలో 2,800 బస్సులను ఈవీగా మార్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్లాన్ చేస్తోందన్నారు. దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించామని చెప్పారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో కొత్త డీజిల్ ఆటోలకు అనుమతి ఇవ్వట్లేదన్నారు. ఇప్పటికే సిటీలో ఉన్న పాత ఆటోలకు రెట్రో ఫిటింగ్ ఇంజన్‌‌‌‌‌‌‌‌లను అమర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.