పుస్తకం తరగని సంపద.. బుక్ ఫెయిర్ ముగింపు సభలో మంత్రి పొన్నం

 పుస్తకం తరగని సంపద.. బుక్ ఫెయిర్ ముగింపు సభలో  మంత్రి పొన్నం

ముషీరాబాద్,వెలుగు: పుస్తకం తరగని సంపద అని..  మేథో సంపత్తికి ఎంతో దోహదపడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. నేటితరం పిల్లలు సెల్ ఫోన్ లో ముగినిపోతూ.. పుస్తకాలు చదవడం మర్చిపోతున్నారని, తల్లిదండ్రులు పుస్తక పఠనం అలవాటు చేయించాలని సూచించారు. ఎన్టీఆర్ స్టేడియంలో పది రోజులపాటు కొనసాగిన బుక్ ఫెయిర్ సోమవారం ముగింపు సభకు ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు.

సమాజంలో విభిన్న అంతరాలు, అసమానతలు పోవాలంటే పుస్తకాలు ఒక మార్గదర్శకంగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కె. శివారెడ్డి, ప్రొఫెసర్ రమా మెల్కొటే, ఓయూ వీసీ రవీందర్, జూలూరి గౌరీ శంకర్, మామిడి హరికృష్ణ, వాసు, నారాయణరెడ్డి, కోయ చంద్రమోహన్, రాజేశ్వరరావు,శృతికాంత్, భారతి, రచన తదితరులు పాల్గొన్నారు.