
బషీర్బాగ్, వెలుగు: విద్య ద్వారానే ఉన్నత శిఖరాలకు ఎదుగుతామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ సగర సంఘం ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఆదివారం శ్రీ సగర భగీరథ మహర్షి జయంతోత్సవాలు నిర్వహించారు. మంత్రి పొన్నంతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
రాజకీయంగా ఎదగాలంటే సగరులు ఐక్యంగా ఉండాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. భగీరథుడు స్పూర్తితో అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండేలా సగరులు ముందుకు పోవాలని కోరారు. సామాజిక పరంగా రాబోయే కాలంలో అందరికీ న్యాయం చేయడానికి సమగ్ర ప్రణాళికతో ముందుకు పోతున్నామన్నారు.