
- అభివృద్ధి చూసే వేస్తరు: మంత్రి పొన్నం ప్రభాకర్
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సానుభూతితో ప్రజలు ఓట్లు వేయరని, అభివృద్ధి చూసి మాత్రమే ఓట్లు వేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం ఎర్రగడ్డ, యూసఫ్ గూడ ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ లో అభివృద్ధి పరుగులు తీయాలంటే తప్పనిసరిగా కాంగ్రెస్ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు.
అనంతరం కాంగ్రెస్ నాయకుడు నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో యూసఫ్ గూడలో ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి పథకం కింద పలువురు మైనారిటీ మహిళలకు ఆయన కుట్టు మిషన్లను అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు అజారుద్దీన్, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.