సౌకర్యాలు మా బాధ్యత.. చదువు మీ బాధ్యత : మంత్రి పొన్నం ప్రభాకర్

సౌకర్యాలు మా బాధ్యత.. చదువు మీ బాధ్యత : మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, వెలుగు: విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత, బాగా చదివి కాలేజీకి గుర్తింపు తీసుకురావడం విద్యార్థుల బాధ్యత అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్​లో కొత్తగా ఏర్పాటైన శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు, కాలిక్యులేటర్లు, విద్యా కిట్స్ పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. కాలేజీకి కావలసిన అన్ని సదుపాయాలను కల్పించామని, హాస్టల్ సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 

ఏవైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన హామీ ఇచ్చారు. విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రత్యేక కౌన్సెలింగ్ ఏర్పాటు చేస్తామని, స్పాట్ అడ్మిషన్ల అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వీసీ ఉమేశ్ కుమార్, ఆర్డీవో రామ్మూర్తి, అసోసియేషన్ ప్రెసిడెంట్ రవీందర్ గౌడ్, జోనల్ ప్రెసిడెంట్ రవీందర్, ఎంవీఐలు అపర్ణ, రవీందర్, సైదా, ప్రత్యూష, అమృత పాల్గొన్నారు.

ఎస్ఎంఎస్ పంపితే సెకనులో స్పందిస్తా.. 

స్పాట్ అడ్మిషన్లపై సమాచారం ఇవ్వలేదని ఓ అధ్యాపకుడి పై మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మెమో జారీ చేయాలని వీసీని ఆదేశించారు. ఎస్ఎంఎస్ పంపితే సెకనులోనే స్పందిస్తానని సమాచారం ఇవ్వకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం హుస్నాబాద్ మార్కెట్ యార్డులో అంగన్వాడీ టీచర్స్, హెల్పార్ లకు మంత్రి చీరలను పంపిణీ చేశారు. మీ మంత్రిగా మీ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని  హమీ ఇచ్చారు