400 ఏళ్ల క్రితమే భవిష్యత్ ​చెప్పిన ‘పోతులూరి’ : మంత్రి పొన్నం ప్రభాకర్​

400 ఏళ్ల క్రితమే భవిష్యత్ ​చెప్పిన ‘పోతులూరి’ : మంత్రి పొన్నం ప్రభాకర్​

ముషీరాబాద్, వెలుగు: 400 ఏళ్ల క్రితమే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి భవిష్యత్​చెప్పారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​అన్నారు. వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవాన్ని బుధవారం ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్ చారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, చీకోటి ప్రవీణ్, లాల్కోట వెంకటాచార్యులు, అట్లూరు రవీంద్రాచారి, పాండురంగాచారి, మేడోజు శంకరాచార్యులు తదితరులు హాజరయ్యారు.

కర్నూలుకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలి

బషీర్​బాగ్ : సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ చాంపియన్ అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆంధ్రపదేశ్ మాజీ సీఎం దామోదరం సంజీవయ్య వర్ధంతి సందర్భంగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న  ఆయన విగ్రహానికి, నెక్లెస్ రోడ్ సంజీవయ్య పార్కు లోని సమాధికి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్​తో కలిసి నివాళి అర్పించారు. కాంగ్రెస్ లో క్రమశిక్షణ గల నాయకుడిగా దామోదరం సంజీవయ్య మా అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు.

ఆయన పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాస్తామన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మణ్ యాదవ్, నాయకులు కైలాష్, లక్ పతి గౌడ్, గరుగంటి రమేశ్, నాగభూషణం, శంభుల శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.