ప్రజా ఉద్యమాలకు ప్రత్యక్ష సాక్షి కొండా లక్ష్మణ్ బాపూజీ : మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రజా ఉద్యమాలకు ప్రత్యక్ష సాక్షి  కొండా లక్ష్మణ్ బాపూజీ : మంత్రి  పొన్నం ప్రభాకర్

బషీర్​బాగ్, వెలుగు: తెలంగాణలో పురుడు పోసుకున్న అన్ని ప్రజా ఉద్యమాలకు ప్రత్యక్ష సాక్షి కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన జీవితం తెలంగాణ ఉద్యమంతో పెనవేసుకుందని మంత్రి  పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం రవీంద్రభారతిలో బీసీ సంక్షేమ శాఖ, కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతిని నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్​ బాపూజీ సేవలను కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం  బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి జీవో 9 విడుదల చేసినట్లు రాజకీయాల్లోనే కాకుండా భవిష్యత్తులో విద్య, ఉద్యోగాల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో చట్టం చేసి రాష్ట్రపతి, గవర్నర్ కు పంపినట్లు తెలిపారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఇరవర్తి అనిల్, మేయర్ విజయలక్ష్మి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ గుంటి నగేశ్,  పద్మశాలి సంఘం నేతలు పాల్గొన్నారు.