గిరిజనుల సంస్కృతికి ప్రతీక తీజ్ పండుగ : మంత్రి పొన్నం ప్రభాకర్

గిరిజనుల సంస్కృతికి ప్రతీక తీజ్ పండుగ : మంత్రి పొన్నం ప్రభాకర్

కోహెడ (హుస్నాబాద్), వెలుగు: గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. గురువారం హుస్నాబాద్ బంజారా భవన్ లో జరిగిన తీజ్ ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనులతో కలిసి నృత్యం చేసి అందరిని అలరించారు. 

అనంతరం మాట్లాడుతూ 1978లో ఇందిరాగాంధీ గిరిజనుల అభ్యున్నతి కోసం ఎస్టీ హోదా కల్పించారని గుర్తుచేశారు. విద్యా కటాక్షం, లక్ష్మీ కటాక్షం ఉన్నవాళ్లు పేదవాళ్లకి అండగా ఉండాలని సూచించారు. తను శాసనసభ్యుడిగా అయ్యే ముందు సంఘం నిర్మాణ బాధ్యత తనదని చెప్పి రూ,45 లక్షలు కేటాయించానన్నారు. బంజారా భవన్ పూర్తి చేసే బాధ్యత తనదన్నారు. 

గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణ స్పీడప్ ​చేయాలి

గౌరవెల్లి ప్రాజెక్ట్  భూసేకరణ స్పీడప్ ​చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. గురువారం హుస్నాబాద్​ మున్సిపల్​ఆఫీస్​లో నియోజకవర్గ అభివృద్ధిపై,పెండింగ్​ పనులు, ప్రభుత్వ పథకాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ..మొదటి దశలో ఇందిరమ్మ ఇల్లు వచ్చిన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తిచేసుకోవాలన్నారు.

 ప్రభుత్వం కొత్తగా అందిస్తున్న రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియగా కొనసాగుతాయని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అందరికి అందేలా చూడాలని అధికారులకు సూచించారు. సమావేశంలో లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి, ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, సింగిల్ విండో చైర్మన్ శివయ్య పాల్గొన్నారు.