
ఎల్కతుర్తి/ భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని వై జంక్షన్‌ను రూ.4.29 కోట్లతో అభివృద్ధి చేసినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వచ్చే ఏడాది నాటికి ఎల్కతుర్తిలో బాసర త్రిపుల్ ఐటీ క్యాంపస్ ప్రారంభిస్తామని చెప్పారు. ఎల్కతుర్తి జంక్షన్‌ను ఆయన గురువారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం సెంట్రల్ లైటింగ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎల్కతుర్తిలో ప్రాథమిక ఆస్పత్రి అప్ గ్రేడేషన్, 132 కేవీ సబ్ స్టేషన్, జంక్షన్ నుంచి మడిపల్లి వరకు రోడ్డు, కోర్టు ఏర్పాటుకు అనుమతులు వచ్చాయని తెలిపారు.
గౌరవెల్లి ద్వారా భీమదేవరపల్లి, దేవాదుల, ఎస్సారెస్పీ ద్వారా ఎల్కతుర్తి మండలాల్లో రైతులకు సాగునీరందిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్, సిద్దిపేట కలెక్టర్ హైమావతి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, హనుమకొండ ఆర్డీవో రమేశ్ రాథోడ్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, పీవో అజిత్రెడ్డి, ఈఈ భీంరావు తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు భీమదేవరపల్లిలో నిర్మాణం పూర్తి చేసుకున్న మార్పాటి సుధఅశోక్రెడ్డి, శృతి జలంధర్రెడ్డిల గృహప్రవేశానికి మంత్రి పొన్నం హాజరయ్యారు. అనంతరం ముల్కనూర్ రైతువేదికలో 63 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కొత్తపల్లి గ్రామంలో హైవేపై ఏర్పాటు చేసిన సెంట్రల్‌లైటింగ్ సిస్టంను మంత్రి ప్రారంభించారు.