కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ బినామీ: మంత్రి పొన్నం ప్రభాకర్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ బినామీ: మంత్రి పొన్నం ప్రభాకర్

జ్యూడీషియల్ ఎంక్వైరీకి బీజేపీ సహకరించాలని.. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు కిషన్ రెడ్డి లేఖ రాయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. అనేక కేసుల్లో కేసీఆర్ ఫ్యామిలీని బీజేపీ రక్షించిందని అన్నారు. ఇన్నేళ్లుగా కేసీఆర్ పై విచారణ ఎందుకు చేయట్లేదని బీజేపీని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ను రక్షించేందుకే సీబీఐ ఎంక్వైరీ కోరుతున్నారని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ బినామీ అని వ్యాఖ్యానించారు. ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిలో బీజేపీ పాత్ర శూన్యంగా ఉందని మండిపడ్డారు. 

పొడగింపు లేదు..

ప్రజా పాలన దరఖాస్తులకు పొడగింపు లేదని.. జనవరి 6 లోపే అందరూ అప్లై చేసుకోవాలని మంత్రి పొన్నం వెల్లడించారు. ప్రజాపాలన అప్లికేషన్లపై రాజకీయాలు ఏంటని నిలదీశారు. లేడీస్ ఫ్రీ జర్నీ స్కీంను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని మండిపడ్డారు. ఆటో డ్రైవర్లు బీఆర్ఎస్ ట్రాప్ లో పడొద్దని పొన్నం చెప్పారు. 

హిట్ అండ్ రన్ కేసుల్లోని కొత్త రూల్స్ ను ఆపేయాలని చెప్పారు. ట్రక్కు డ్రైవర్ల సమ్మెతో నిత్యావసరాల ధరలు పెరుగతాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.