
హుస్నాబాద్ : ఆర్టీసీ సమస్యలు పరిష్కరిం చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రేపు, ఎల్లుండి ప్రత్యేకంగా తాను ఆర్టీసీ ఉద్యోగుల కోసం హైదరాబాద్లోనే అందుబాటు లోనే ఉంటానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ సిద్దిపేట జిల్లా హుస్నాబా ద్ ఆర్టీసీ బస్ స్టేషన్ ను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు బస్టాండ్ లో ప్రయాణికులు,ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ లతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Also Read : ప్రయాణికులకు షాకిచ్చిన ఇండియన్ రైల్వే
ఆర్టీసీ సమస్యలపై తనతో నేరుగా మాట్లాడవచ్చన్నారు. 'ఆర్టీసీ మా కుటుంబం.. కుటుంబ పెద్దగా సమస్య పరిష్కారం చేసుకుంటాం. సమస్య పరిష్కారానికి మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఆర్టీసీ వాళ్లు ఎవరు వచ్చిన చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. కష్టాల నుండి ఆర్టీసీ బయటపడుతుం ది. ఇప్పుడిప్పుడే మన సమస్యలు దశలవారీ గా పరిష్కరిస్తున్నాం. మీరు ఎప్పుడు వచ్చిన నేను చర్చలకు సిద్ధంగా ఉన్నం' అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.