IRCTC News: ప్రయాణికులకు షాకిచ్చిన ఇండియన్ రైల్వే.. ఇకపై అలా జర్నీ కుదరదు..

IRCTC News: ప్రయాణికులకు షాకిచ్చిన ఇండియన్ రైల్వే.. ఇకపై అలా జర్నీ కుదరదు..

Railway News: భారతీయ రైల్వే సంస్థ పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తుంది. దేశవ్యాప్తంగా విస్తృత కనెక్టివిటీ కలిగి ఉండటంతో సామాన్య భారతీయ ప్రజలకు అత్యంత ఇష్టమైన ప్రయాణ ఎంపికగా నిలిచింది. అయితే తాజాగా ఈ సంస్థ మే 1, 2025 నుంచి తన నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. 

కొత్తగా ప్రకటించిన రైల్వే టిక్కెట్ బుక్కింగ్ విధానం కింద వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న టిక్కెట్ హోల్డర్లపై ప్రభావం పడనుంది. దీని ప్రకారం కన్ఫమ్ కాకుండా.. వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులు ఇకపై స్లీపర్, ఏసీ కోచ్‌లలో ప్రయాణించటం కుదరదని స్పష్టం చేసింది. అంటే దీనిప్రకారం వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టిక్కెట్లను కలిగి ఉన్న ప్రయాణీకులు ఇకపై జనరల్ బోగీల్లో మాత్రమే ప్రయాణించేందుకు వీలు ఉంటుంది. మారిన రూల్స్ ప్రకారం ఇకపై వారు ఏసీ లేదా స్లీపర్ కంపార్ట్మెంట్లలో ప్రయాణించలేరు.

Also Read  :అంబానీ సరికొత్త యుద్ధం.. నెలకి రూ.81కే అన్‌లిమిటెడ్ కాల్స్ ప్లాన్

కొత్త నిబంధనలను పాటించని వ్యక్తులపై జరిమానా విధించబడుతుందని వెల్లడైంది. వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో బోర్డింగ్ స్లీపర్ కోచ్‌లోకి ఎక్కితే వారిపై రూ.250 జరిమానా విధించబడుతుంది. ఇక ఏసీ బోగీ ఎక్కుతూ చిక్కితే మాత్రం రూ.440 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి. అలాగే వీటికి అదనంగా నిబంధనలను ఉల్లంఘించే ప్రయాణికుల నుండి వారు ఎక్కిన తదుపరి రైలు స్టేషన్ నుంచి ఛార్జీని రైల్వే టీసీలు వసూలు చేయవచ్చు.

దీనికి ముందు కొన్ని వారాల కిందట రైల్వే టిక్కెట్ల ముందస్తు రిజర్వేషన్ గడువు విషయంలో కూడా కీలక మార్పులు ప్రకటించబడ్డాయి. గతంలో 120 రోజలకు ముందే ప్రయాణ టిక్కెట్లను రిజర్వేషన్ కింద బుక్ చేసుకునే వెసులుబాటును ప్రస్తుతం కేవలం 60 రోజులకు తగ్గించారు. ప్రస్తుతం స్లీపర్ లేదా ఏసీ బోగీల్లో పెరుగుతున్న అనవసరపు రద్దీని తగ్గించేందుకు రైల్వేశాఖ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టిందని తెలుస్తోంది.