
కోహెడ(హుస్నాబాద్), వెలుగు: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు అప్లై చేసుకున్న వెంటనే లబ్ధిదారులకు పేమెంట్ చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. శనివారం హుస్నాబాద్ లోని క్యాంప్ ఆఫీస్ లో 25 మందికి చెక్కులు పంపిణీ చేశారు. పెళ్లయిన వెంటనే ఆధారాలతో సహా సంబంధిత అధికారి వద్ద అప్లై చేసుకోవాలని సూచించారు.
భవిషత్ లోనూ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పెండింగ్ లో ఉండకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, ఆర్డీవో రామ్మూర్తి పాల్గొన్నారు.