ఎరువులకు ఇబ్బందులు లేకుండా కేంద్ర మంత్రి చొరవ చూపాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

ఎరువులకు ఇబ్బందులు లేకుండా కేంద్ర మంత్రి చొరవ చూపాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

కోహెడ (హుస్నాబాద్), వెలుగు: కరీంనగర్ పార్లమెంట్ నియోజవర్గంలో ఎరువులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ మండలాల్లో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్​హైమావతి, అడిషనల్​ కలెక్టర్​గరిమా అగర్వాల్​తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 

అనంతరం మంత్రి మాట్లాడుతూ..విత్తనాలు, విద్యుత్ రాష్ట్రం చేతిలో ఉంటాయని, ఎరువుల సరఫరా కేంద్రం చేతిలో ఉంటుందన్నారు. యూరియా కేంద్రాల వద్ద బీఆర్ఎస్​నాయకులు క్యూ లైన్ లో చెప్పులు పెట్టి వారి పేపర్లు, ఛానెల్​లో వేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. హనుమకొండ జిల్లా పరిధిలో గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణ కోసంరూ,25 కోట్లు వచ్చాయని, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలకు కూడా నిధులు వస్తాయన్నారు. 

గౌరవెల్లి ప్రాజెక్టు విషయంలో ఎన్జీటి రూ.10 కోట్లు ఫైన్ వేసిందని ఆ ఫైన్ కూడా కట్టామన్నారు. సమస్య అధిగమించి కాల్వల భూసేకరణ పూర్తి చేసి నీరు అందిస్తామన్నారు. కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి, ఆర్డీవో రామ్మూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, ఏఎంసీ చైర్మన్లు తిరుపతిరెడ్డి, నిర్మల ఉన్నారు.