నేషనల్హైవే పనులను స్పీడప్ చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

నేషనల్హైవే పనులను స్పీడప్ చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

కోహెడ (హుస్నాబాద్) వెలుగు: నేషనల్​హైవే పనులను స్పీడప్​ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ అధికారులను ఆదేశించారు. శనివారం పందిళ్ల బిడ్జి, ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను పరిశీలించారు. స్థానికులతో కాసేపు ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు. వర్షాలు ప్రారంభం కాకముందే పనులను కంప్లీట్​చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకు ముందు కోహెడ మండలం బస్వాపూర్​లో ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్​ కార్యకర్త కాల్వ రాజు కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట లైబ్రరీ చైర్మన్​లింగమూర్తి, ఆర్డీవో రామ్మూర్తి, మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య ఉన్నారు.