తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడండి : పొన్నం ప్రభాకర్

తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడండి  :   పొన్నం ప్రభాకర్

వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్ధిపేట జిల్లా  కోహెడ మండలం శనిగరం గ్రామంలో పర్యటించారు మంత్రి. గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పెద్దచెరువు పనులను పరిశీలించారు. గ్రామంలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా.. అదనపు మోటార్లు ఏర్పాటు చేసుకోవాలని గ్రామ స్పెషల్ ఆఫీసర్లకు సూచించారు. 

వచ్చే విద్యా సంవత్సరం వరకు స్కూళ్లలో తరగతి గదులకు కలర్స్ వేసి.. టాయిలెట్స్ నిర్మించాలన్నారు మంత్రి. ఈ సందర్భంగా ఫిష్ మార్కెట్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు గ్రామస్తులు. దీంతో ఎన్నికల కోడ్ అయిపోగానే సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్.