రైతులు ధాన్యాన్ని బయట అమ్ముకోవద్దు.. ప్రతి గింజ కొంటాం: మంత్రి పొన్నం ప్రభాకర్

రైతులు ధాన్యాన్ని బయట అమ్ముకోవద్దు.. ప్రతి గింజ కొంటాం: మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్: రైతులు ధాన్యాన్ని బయట అమ్ముకోవద్దని.. ప్రతి గింజ ప్రభుత్వమే కొంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం (మే 16) ధాన్యం కొనుగోళ్లపై సీఎస్, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా నిర్వహించారు. ఈ సమావేశంలో పొల్గొన్న మంత్రి పొన్నం మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రాష్ట్రవ్యాప్తంగా సన్న, దొడ్డు వడ్లు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. 

ALSO READ | మునుపెన్నడూ ఇలా లేదు.. సిద్ధంగా ఉండండి.. విద్యుత్ శాఖ అధికారులకు CM రేవంత్ కీలక ఆదేశం

అధిక తూకం లేకుండా, ధాన్యం తరలింపుకు రవాణా ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పేమెంట్ ఆలస్యం లేకుండా వెంటవెంటనే రైతుల అకౌంట్లో పడేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రైతులకు ఇబ్బంది కలిగితే సంబంధిత టోల్ ఫ్రీ నెంబర్‎కి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామన్నారు. పంటలు ఎండిపోకుండా విద్యుత్, నీటి సరఫరా చేశామని.. మాది రైతుల ప్రభుత్వమని పేర్కొన్నారు.