అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తం.. కొత్త పేర్లు కూడా యాడ్ చేస్తం: మంత్రి పొన్నం

అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తం.. కొత్త పేర్లు కూడా యాడ్ చేస్తం: మంత్రి పొన్నం

హైదరాబాద్: రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం (జూలై 22) హైదరాబాద్ కలెక్టరేట్‎లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ, సీజనల్ వ్యాధులను అరికట్టడంపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మంత్రి పొన్నం రివ్యూ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో 10 సంవత్సరాల తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు. రేషన్ కార్డులో కొత్త పేర్లను కూడా యాడ్ చేసేందుకు అవకాశం కల్పించామని చెప్పారు. హైదరాబాద్‎లో 43 వేల కొత్త రేషన్ కార్డులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇంకా లక్షకు పైగా దరఖాస్తులు పెండింగ్‏లో ఉన్నాయన్నారు.

Also Read : రాజకీయం చేయొద్దు.. పార్టీలకు అతీతంగా పథకాలు

హైదరాబాద్ జిల్లాల్లో అర్హుల ఎంపిక ప్రక్రియ కొంత ఆలస్యంగా జరుగుతుందని.. పెండింగ్ అప్లికేషన్ ప్రాసెస్ వెరిఫికేషన్ తొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తున్నానన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని పని చేయాలని సూచించారు. ఎక్కడ జాప్యం చేయకుండా..
సివిల్ సప్లయ్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయం చేసుకొని వెరిఫికేఫన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.