టోల్ ట్యాక్స్​లు పెంచొద్దు..గడ్కరీకి మంత్రి ప్రశాంత్ రెడ్డి లేఖ   

టోల్ ట్యాక్స్​లు పెంచొద్దు..గడ్కరీకి మంత్రి ప్రశాంత్ రెడ్డి లేఖ   

హైదరాబాద్, వెలుగు : వచ్చే నెల 1 నుంచి టోల్ ట్యాక్స్ పెంచాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర ఆర్ అండ్ బీ మంత్రి ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 9ఏండ్లలో టోల్ ట్యాక్స్​లను 300% పెంచారని, ఇప్పుడు మళ్లీ పెంచడం సరికాదన్నారు. బుధవారం ఈ మేరకు కేంద్ర మంత్రికి ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలోని టోల్ గేట్ల నుంచి 2014లో రూ.600 కోట్లు వసూలైతే.. ఈఏడాది రూ.1,824 కోట్లకు చేరాయన్నారు. టోల్ చార్జీల పెంపుతో వాహ న చార్జీలు పెరిగి కూరగాయలు, ఇతర నిత్యావసరాల ధరలు పెరుగుతాయని, జనం ఇబ్బందులు పడ తారని తెలిపారు.

9ఏండ్ల నుంచి రాష్ట్రంలో 113 నేషనల్ హైవే ప్రాజెక్టులు, సీఆర్ఐఎఫ్ (సెంటర్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) పనులకు కలిపి మొత్తం రూ.1,25,176 కోట్లు శాంక్షన్  
చేసినట్టు కాగితాల మీద చూపిస్తున్నారని, కానీ ఇప్పటిదాకా రూ.20,350 కోట్లు ఖర్చు చేశారని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇందులో రాష్ట్రంలో టోల్ ట్యాక్స్ ల ద్వారా వసూలు చేసిన నిధులే ఎక్కువగా ఉన్నాయన్నారు.