
‘పిచ్చి కుక్కల్ని వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడ్తయి. అంత మాత్రాన వేట ఆపుతామా?.. కవితమ్మా ధైర్యంగా ఉండండి’ అని ఎమ్మెల్సీ కవితకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా సంఘీభావం తెలిపారు. ‘కేసీఆర్ కుటుంబ సభ్యులమైన మేమందరం, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరం మీ ధర్మపోరాటంలో మీతోపాటు ఉన్నాం భవిష్యత్‌లోనూ ఉంటాం. ధర్మం మీ వైపు ఉంది. అంతిమ విజయం మీదే.. మనదే’అని ట్వీట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇవాళ ఉదయం 11 గంటలకు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆమెకు సంఘీభావంగా ఇప్పటికే పలువురు బీఆర్‌ఎస్ నేతలు, భారత జాగృతి సంస్థ కార్యకర్తలు ఢిల్లీకి చేరుకున్నారు