అజయ్ అన్న మనుషులంటే ఆఫీసర్లు పోస్కుంటరు.. రైతు ఉత్సవాల్లో మంత్రి పువ్వాడ 

అజయ్ అన్న మనుషులంటే ఆఫీసర్లు పోస్కుంటరు..  రైతు ఉత్సవాల్లో మంత్రి పువ్వాడ 

 

  • అజయ్ అన్న మనుషులంటే ఆఫీసర్లు పోస్కుంటరు
  • ఎమ్మార్వో, ఎంపీడీఓ, ఎస్సై వణుక్కుంట పనిచేస్తరు  
  • ఈ గౌరవాన్ని కార్యకర్తలు నిలబెట్టుకోవాలె  
  • రైతు ఉత్సవాల్లో మంత్రి పువ్వాడ 

ఖమ్మం టౌన్, వెలుగు:   రైతు ఉత్సవాల సందర్భంగా గవర్నమెంట్ ఆఫీసర్లపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన కామెంట్లు వివాదాస్పదం అయ్యాయి. ‘‘అజయ్ అన్న మనుషులంటే.. ఆఫీసర్లు ఉచ్చ పోస్కుంటరు. ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎస్సైలు వణుక్కుంట పని చేస్తరు..” అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం ఖమ్మం జిల్లా, రఘునాథపాలెం మండల కేంద్రం, రాంక్యా తండా రైతువేదికలో జరిగిన సంబురాల్లో ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

‘‘మీరు అజయ్ అన్న మనుషులు. నేను మంత్రిగా ఉంటే మీరు మంత్రిగా ఉన్నట్లే. ఇయ్యాల మీరు సమస్యలపై తహసీల్దార్, ఎస్సైలను అడిగితే వణుక్కుంటా పని చేస్తరు. నేను పేరు పెట్టి పిలిచే ప్రతి ఒక్కరూ నా మనుషులే. మీ జోలికి ఎవరన్నా రావాలంటే ఉచ్చ పోసుకుంటారు. మీతో జాగ్రత్తగా ఉండాలని ఎమ్మార్వో, ఎంపీడీఓ, ఎస్సైలు కూడా అనుకుంటారు. మీకు ఉన్న ఈ గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే ఐదు నెలలే టైం ఉంది. మీరే కథానాయకులు కావాలె.

శత్రువుల ఎత్తుగడలను తిప్పికొట్టాలె” అని మంత్రి కామెంట్ చేశారు. ‘‘కొందరు కొత్త పిచ్చోళ్లు తయారయ్యారు. నన్ను గద్దె దించుతామని, అసెంబ్లీ గేటు దాటనివ్వబోమని అంటున్నరు. కేసీఆర్ ను అడ్డంపెట్టుకుని సంపాదించారు. ఇప్పుడు బయటకు వచ్చి ఎగిరిపడుతున్నారు” అంటూ ఫైర్ అయ్యారు. ప్రజలకు అన్ని స్కీంలు అందాలంటే సీఎం కేసీఆర్ ను, తనను గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.