రూ.7 కోట్లతో మున్నూరు కాపు భవనం కడతాం

రూ.7 కోట్లతో మున్నూరు కాపు భవనం కడతాం

వరంగల్‍, వెలుగు: గ్రేటర్ వరంగల్​లో రూ.7 కోట్లతో హనుమకొండ జిల్లా మున్నూరు కాపు భవనం నిర్మాణం చేపడుతామని వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి తెలిపారు. నగరంలో చేపట్టిన బిల్డింగ్‍ పనులను సంఘం నేతలతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో మున్నూరు కాపుల సంఖ్య అధికంగా ఉన్నా, గతంలో వారికి తగిన ప్రాధాన్యత దక్కలేదన్నారు. తాను మున్నూరు కాపుల సంక్షేమానికి అండగా ఉంటానని చెప్పారు. 

ఇందులో భాగంగానే మొదట్లో రూ.5 కోట్లతో నిర్మించతలపెట్టిన సంఘం భవన పనులను మరో రెండు కోట్లను పెంచడం ద్వారా రూ.7 కోట్లకు రీఎస్టిమేట్‍ చేపించామన్నారు. భవిష్యత్‍ తరాలకు ఉపయోగపడేలా సంఘం భవనం నిర్మాణం చేస్తున్నట్లు వెల్లడించారు. భవన నిర్మాణ కన్వీనర్‍ ఈవీ శ్రీనివాస్‍ మాట్లాడుతూ తమకు ఎమ్మెల్యే నాయిని అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మంద ఐలయ్య, కటకం పెంటయ్య, గైనేని రాజన్‍, కోరబోయిన సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.