ప్రచారంలో పువ్వాడకు చేదు అనుభవం.. ప్రత్యర్థికి ముఖం చూపించలేక తల తిప్పుకున్న మంత్రి

ప్రచారంలో పువ్వాడకు చేదు అనుభవం.. ప్రత్యర్థికి ముఖం చూపించలేక తల తిప్పుకున్న మంత్రి

ఎన్నికల ప్రచారంలో మంత్రి పువ్వాడకు చేదు అనుభవం ఎదురైంది. ప్రత్యర్థికి ముఖం చూపించలేక.. పువ్వాడ తల తిప్పుకున్నారు. జై కాంగ్రెస్, జై తుమ్మల నినాదాలతో కాంగ్రెస్ శ్రేణులు హోరెత్తించారు. ఖమ్మం పట్టణంలోని 22వ డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్ధి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ.. కార్నర్ మీటింగ్ లో ప్రసగిస్తుండగా.. అదే దారిలో ప్రచారం చేయాల్సిన బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తుమ్మల ప్రసంగిస్తుండగా తలతిప్పుకొని.. త్వరగా ప్రచార రథాన్ని ముందుకు సాగాలని ఆదేశించారు.

ఈ క్రమంలో జై పువ్వాడ అంటూ.. బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. అయితే అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలతో జై కాంగ్రెస్ , జై తుమ్మల నినాదాలతో హోరెత్తించారు.