స్కూల్‌ను తనిఖీ చేసిన మంత్రి సబితా

స్కూల్‌ను తనిఖీ చేసిన మంత్రి సబితా

రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజు 30 నుంచి 40 శాతం విద్యార్థులు హాజరయ్యారన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. హైదరాబాద్ లోని విజయనగర్ కాలనీలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె..పిల్లలను తమ సొంత బిడ్డల్లా చూసుకుంటామన్నారు. పారిశుధ్యం పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు.పేరెంట్స్ తమ పిల్లలను బడులకు పంపేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారన్నారు.కోవిడ్ నిభందనలు తప్పక పాటించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. పిల్లలకు ప్రేయర్ సమయంలోనే జాగ్రత్తలు గుర్తు చేయాలన్నారు. మొత్తం 60 లక్షల మంది విద్యార్థుల్లో 20 లక్షల మంది ప్రభుత్వ బడుల్లో చదువుతున్నారన్నారు. ఈ ఏడాది ఫస్ట్ క్లాస్ లో  కొత్తగా లక్ష మంది జాయిన్ అయ్యారన్నారు.