కరెంట్ స్తంభాలకు శిలాఫలకం.. మంత్రి సబితకు చేదు అనుభవం

కరెంట్ స్తంభాలకు శిలాఫలకం.. మంత్రి సబితకు చేదు అనుభవం

జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. ప్రారంభోత్సవానికి సంబంధించిన శిలాఫలకాలకు దిమ్మెలు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్‭లో రూ.86 లక్షల విలువైన అభివృద్ధి కార్యక్రమల శంకుస్థాపనకు మంత్రి హాజరయ్యారు. అయితే అధికారులు ఒక దగ్గర ఇంటి గోడకు శిలాఫలకాన్ని ఏర్పాటు చేస్తే.. మరో దగ్గర రెండు కరెంట్ స్తంభాలకు వైర్లతో బిగించారు. దీంతో శంకుస్థాపన చేయకుండానే మంత్రి వెనుదిరిగారు. కరెంటు స్థంభాలకు శిలాఫలకాన్ని ఏర్పాటు చేయడం ఏంటని అధికారులను నిలదీశారు. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలకు ఆదేశించారు. మంత్రి అక్కడి నుంచి వెళ్లగానే వైర్లతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు.