పెద్ద మనసు చాటుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

పెద్ద మనసు చాటుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మండుటెండలో కాళ్లకు చెప్పులు లేకుండా వెళ్తున్న విద్యార్థులను చూసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. శనివారం మామిడిపల్లి మీదుగా వెళ్తుండగా.. చిన్నారులను చూసిన ఆమె వెంటనే కాన్వాయ్ ఆపారు. వారిని దగ్గరకు పిలుచుకుని మంచినీళ్లు, చాక్లెట్లు ఇచ్చి ఆప్యాయంగా మాట్లాడారు. వారెవరికీ చెప్పులు లేవన్న విషయాన్ని గుర్తించిన మంత్రి సబిత.. స్థానిక టీఆర్ఎస్ నాయకుడు నిమ్మల నరేందర్ గౌడ్కు ఫోన్ చేసి విద్యార్థులకు అవసరమైన వస్తువులు కొనివ్వాలని సూచించారు. దీంతో ఆయన వెంటనే వారికి షూస్, సాక్స్ అందించారు. వాటిని అందుకున్న చిన్నారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తమకు షూస్, సాక్స్ అందజేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డికి విద్యార్థులు కృతజ్ఞతలు చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

హనుమాన్ భజనలతో మార్మోగిన కొండగట్టు

గుట్టలో బాలాలయం తొలగింపు