స్కూల్స్ రీ ఓపెన్.. పిల్లలందరికీ స్వాగతం

స్కూల్స్ రీ ఓపెన్.. పిల్లలందరికీ స్వాగతం
  • పిల్లలకు ఇంగ్లీషు మీడియంలో బోధన
  • 20 నుంచి 25 రోజుల పాటు బడి బాట
  • పిల్లలకు ఇబ్బంది లేకుండా బ్జిడ్జి క్లాసెస్
  • ఇంగ్లీషు - తెలుగు బుక్స్ ప్రింట్ పూర్తి
  • పండుగ వాతావరణంలో స్కూల్స్ ప్రారంభం
  • ప్రజాప్రతినిధులు స్కూళ్లకు వెళ్లి పిల్లలకు వెల్ కమ్ చెప్పాలి

స్కూళ్ల ప్రారంభంలో ఎలాంటి ఆలస్యం ఉండదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ముందుగా అనుకున్నట్లు జూన్ 13వ తేదీ సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. జూన్ 12వ తేదీ ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో క్లాసులు నిర్వహిస్తామన్నారు. ప్రత్యక్ష క్లాసుల ద్వారానే విద్యార్థులకు సబ్జెక్స్ అర్థమవుతాయని.. బ్రిడ్జీ క్లాసెస్ కండక్ట్ చేయాలని తాము టీచర్లకు సూచించడం జరిగిందన్నారు. కోటి 64 లక్షల పుస్తకాలు ప్రింటింగ్ పూర్తయిందన్నారు. ఉచితంగా యూనిఫాం.. భోజనం అందిస్తామన్నారు. రీ ఓపెన్ ను ఒక పండుగలాగా ప్రజా ప్రతినిధులు నిర్వహించాలని, స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు స్వాగతం చెప్పాలన్నారు. 70 వేల మంది ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరినట్లు, పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేరిపించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావాలని తెలిపారు. పిల్లలకు ఇబ్బంది లేకుండా మన ఊరు మన బడి కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఇంగ్లీషు -తెలుగు బుక్స్ ప్రింటింగ్ పూర్తి : -
ఇంగ్లీషు -తెలుగు బుక్స్ ఇప్పటికే ప్రింటింగ్ పూర్తయ్యాయని, ప్రైవేటు స్కూళ్లకు వెళ్లి ఎలా పరిశీలిస్తున్నారో.. అదే విధంగా ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి పేరెంట్స్ చెక్ చేసుకోవాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో శానిటేషన్, వాటర్ తదితర ఏర్పాట్లు చూసుకోవాల్సిన బాధ్యత గ్రామ సర్పంచ్ పై ఉందన్నారు. మిషన్ భగీరథ వాటర్ ప్రతి స్కూళ్లల్లో ఉండాలని.. స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు ప్రతి స్కూళ్లను విజిట్ చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ఇక బీజేపీ నేతలు పలు విమర్శలు చేయడంపై మంత్రి సబితా రియాక్ట్ అయ్యారు. మన ఊరు మన బడిలో మొదటి విడత కింద రూ. 2 వేల 700 కోట్లు విడుదల చేశామని.. ఇందులో  (రూ. 2,700 కోట్లు) సంబంధించిన నిధుల విషయంలో ఒక్క రూపాయి కూడా కేంద్రం విడుదల  చేయలేదన్నారు.

బండి సంజయ్ పై ఫైర్ :-
గత ఎనిమిది సంవత్సరాల్లో తెలంగాణ సర్కార్ విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు చేయడం జరిగిందని వెల్లడించారు. నవోదయ పాఠశాలకు తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదని వారంతట వారే ప్రశ్నించుకుని.. ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఒక్క పక్క టెట్ వాయిదా వేయమంటూనే మరో పక్క 20 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలంటున్నారు...రాష్ట అధ్యక్షులు బాధ్యతగా మాట్లాడాలని బండి సంజయ్ కు సూచించారు. ఉపాధ్యాయులు మానసిక క్షోభకు గురవుతున్నారని దుష్ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.