
వైసీపీ నాయకుడు జగన్ అక్రమాస్తుల కేసులో శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పెన్నా సిమెంట్ వ్యవహారంలో 2013లో అదనపు చార్జిషీటు దాఖలు చేసింది సీబీఐ. దీన్ని పరిగణలోకి తీసుకుంది కోర్టు. ఈ కేసుకు సంబంధించి సబితా ఇంద్రారెడ్డితో పాటు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పెన్నా ప్రతాప్ రెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, వీడి రాజగోపాల్, రిటైర్డ్ ఐఏఎస్ శామ్యుల్, డీఆర్వో సుదర్శన్ రెడ్డి, తహసీల్దార్ ఎల్లమ్మలకు నోటీసులు జారీ చేసింది. అనంతపురం, కర్నూలు, రంగారెడ్డి జిల్లా తాండూరులోని గనుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని సీబీఐ ఆరోపిస్తోంది.
More News: కోర్టుకు హాజరు కాలేనన్న జగన్…