- కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్‌టౌన్, వెలుగు: భూతగాదాలు లేని జిల్లాగా మెదక్‌ను తీర్చిదిద్దాలని భూమి నక్ష, మ్యాప్, హద్దుల నిర్ణయం పటిష్టంగా ఉండాలని కలెక్టర్‌రాహుల్‌రాజ్ అధికారులకు సూచించారు. ఈ మేరకు మెదక్ మండలంలోని పాషాపూర్‌లో గురువారం గ్రామసభ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..భూభారతి చట్టం ద్వారా అన్ని భూ సమస్యలు పరిష్కారమవుతాయని, పాషాపూర్ లో భూభారతి చట్టం భూముల రీసర్వే కార్యక్రమం నిర్వహించుకోవడనికి గ్రామసభ ఏర్పాటు చేసినట్లు వివరించారు. డిజిటల్ సర్వేతో హద్దుల నిర్ణయించి సర్వే చేస్తామని చెప్పారు.
ఈ రీసర్వే అనంతరం రైతులు ఎక్కడున్నా తన భూమిని పరిశీలించుకోవచ్చని చెప్పారు. అనంతరం జిల్లాలోని 23 గ్రామాల్లో భూభారతి భుముల రీసర్వే చేసి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని కలెక్టర్‌తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నగేశ్, తహసీల్దార్లక్ష్మణ్బాబు, సర్పంచ్, అధికారులు పాల్గొన్నారు.
