ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మొయినాబాద్ మండలం తోల్ కట్టలో కొత్తగా నిర్మించిన ప్రాధమిక పాఠశాల అదనపు తరగతి గదులను ఆమె ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. గురుకుల, సంక్షేమ పాఠశాలల్లో విద్యతో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్న ఏకైక రాష్టం తెలంగాణ అని చెప్పారు. రాష్ట్రంలో మన ఊరు మన బడి ద్వారా 26 వేల స్కూళ్లను 7500 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశామన్నారు.
ఈ సంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తామని మంత్రి సబితారెడ్డి వెల్లడించారు. విదేశాల్లో ఉన్న తెలంగాణ సెటిలర్స్ వారు సంపాదించిన దాంట్లో కొంత మేర తాము చదువుకున్న పాఠశాలల అభివృద్ధి కోసం సహకారం అందించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభివాణి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, జడ్పీటీసీ శ్రీకాంత్, ఎంపీపీ నక్షత్రం పాల్గొన్నారు.
