కేసీఆర్‌తో కొట్లాడైనా నిధులు తెస్తా

కేసీఆర్‌తో కొట్లాడైనా నిధులు తెస్తా

డోర్నకల్ మున్సిపాలిటీనీ దత్తత తీసుకుంటానని తెలిపారు మంత్రి సత్యవతి రాథోడ్. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె శనివారం డోర్నకల్ లో పర్యటించారు. డోర్నకల్ లో అనుకున్నంత అభివృద్ధి జరగలేదని..  KTR శాఖ నుంచి 20 కోట్ల రూపాయల నిధులు వచ్చాయన్నారు. డోర్నకల్ లో రైల్వే జంక్షన్ కు పూర్వ వైభవం  తీసుకవచ్చేందుకు కృషిచేస్తానన్నారు. డోర్నకల్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాతో పాటు  గిరిజన ఆశ్రమ పాఠశాల ఏర్పాటుకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎదురొస్తే అడగండి గతంలో ఎమ్మెల్యేగా పోటీచేసిన వారి అడ్రస్ ఎక్కడని, ఆ పార్టీ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పోటీ చేస్తేనే గెలిపించుకోలేక పోయారు, ఇక వేరే చోట్ల ఎలా గెలుస్తారన్నారు.

15 సీట్లను బహుమతిగా మీరివ్వాలని.. డోర్నకల్ అభివృద్ధికి కంకణ బద్దులమై ఉన్నామని చెప్పారు. కష్ట, సుఖాల్లో నా వెంట ఉన్న ఈ డోర్నకల్ పట్టణ ప్రగతి నా బాధ్యతగా పని చేస్తానని తెలిపారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత తనపై ఉందన్న ఆమె..పట్టణంలో ఏ లోటూ లేకుండా చేసి ప్రగతి బాటలు వేస్తానన్నారు. మంత్రిగా ఉన్నందుకు సీఎం కేసీఆర్ గారి దగ్గర కొట్లాడి అయినా నిధులు తెచ్చి డోర్నకల్ ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు. అభివృద్ధి చేసే పార్టీకి ఓటెయ్యండి..డోర్నకల్ ప్రగతిలో భాగం కావాలన్నారు మంత్రి సత్యవతి రాథోడ్.