పనుల విషయంలో ఎవర్ని ఉపేక్షించేది లేదు : సీతక్క

పనుల విషయంలో ఎవర్ని ఉపేక్షించేది లేదు : సీతక్క

మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. మేడారం జాతర పనుల పై రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇక రివ్యూ  మీటింగ్ లు ఉండవని ఇదే లాస్ట్ మీటింగ్ అని చెప్పారు. పనుల విషయంలో ఎవర్ని ఉపేక్షించేది లేదన్నారు.

ALSO READ :- ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికే నల్గొండ సభ : కడియం శ్రీహరి

రేపు మండమేలిగే పండుగతో జాతర మొదలు కానున్నట్టు సీతక్క తెలిపారు. కొద్దిగా రోడ్ల దగ్గర దుమ్ము విషయంలో ఇబ్బంది అవుతుందని అన్నారు. జాతరలోగ పెండింగ్ లో ఉన్న పనులన్నీ కంప్లీట్ చేయాలని ఆదేశించారు. మేడారం జాతర ఫిబ్రవరి 21 2024 నుంచి ఫిబ్రవరి 24 2024 వరకు జరగనుంది.