
- విశ్లేషణాత్మక శక్తితో ఉన్నత శిఖరాలు
బషీర్‌బాగ్, వెలుగు: విశ్లేషణాత్మక శక్తితో ఉన్నత శిఖరాలకు ఎదగాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. యూనిఫైడ్ కౌన్సిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం రవీంద్రభారతిలో నిర్వహించిన వార్షిక అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నేషనల్, ఇంటర్నేషనల్లెవల్లో నిర్వహించిన వివిధ ఒలింపియాడ్ టాలెంట్ సెర్చ్ టెస్టుల్లో ప్రతిభ కనబర్చిన 250 మంది విద్యార్థులకు మంత్రి సీతక్క అవార్డులు అందజేశారు.
ప్రతిఒక్కరూ నిత్య విద్యార్థిగా ఉండాలని ఆమె కోరారు. ఎంత డబ్బు, ఆస్తి ఉన్నా విజ్ఞానం లేకపోతే వృథా అన్నారు. విశ్లేషణాత్మక, సృజనాత్మక పెంచడానికి యూనిఫైడ్ నిర్వహిస్తున్న ఒలింపియాడ్స్ చిన్నారుల భవిష్యత్‌కు బలమైన పునాదులవుతాయన్నారు. యూనిఫైడ్ కౌన్సిల్ చేస్తున్న కృషిని అభినందించారు. 26 ఏండ్లుగా ఒలింపియాడ్స్నిర్వహిస్తున్నామని యూనిఫైడ్ కౌన్సిల్ సీఈఓ శ్రీనివాస్ కల్లూరి తెలిపారు. ఈ కార్యక్రమంలో సహజ్ సందు(టీవర్క్స్), నటుడు, మోటివేషనల్ స్పీకర్ కె.వి.ప్రదీప్, ప్రఖ్యాత వ్యక్తిత్వ వికాస నిపుణులు డా.బి.వి.పట్టాభిరాం, లీడర్ షిప్ కోచ్ గంపా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.