
కూకట్పల్లిలో ‘లైట్హౌస్’ను ప్రారంభించిన మంత్రి సీతక్క
కూకట్పల్లి/అల్వాల్, వెలుగు: మహిళలు ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. కూకట్పల్లిలో లైట్హౌస్పేరుతో మహిళల ఉపాధి కోసం ఏర్పాటు చేసిన ట్రైనింగ్సెంటర్ను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ప్రభుత్వం కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ప్రగతి బాటలో పయనించాలని సూచించారు. అనంతరం అల్వాల్లయోలా డిగ్రీ కాలేజీలో నిర్వహించిన మిల్లెట్ ఫెస్టివల్లో సీతక్క పాల్గొన్నారు.
తన జీవితంలో చిరుధాన్యాల పాత్ర ఎంతగానో ఉందని, అడవి బిడ్డలమైన తాము చిన్నప్పటి నుంచి చిరుధాన్యాల ఆహార పదార్థాలు తీసుకొని ఆరోగ్యంగా ఉండే వాళ్లమన్నారు. కరోనా సమయంలోనూ పసుపు నీళ్లు తాగడం, ఇతర పౌష్టికాహారం తీసుకోవడంతో మహమ్మారిని జయించినట్లు చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో శేరిలింగంపల్లి, మల్కాజిగిరి ఎమ్మెల్యేలు ఆరెకపూడి గాంధీ, మర్రి రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ చైర్మన్ శోభారాణి, న్యూట్రి హబ్-ఐకార్ -ఐఐఎంఆర్ సీఈఓ డైరెక్టర్ డా. జాన్సన్ స్టాండ్లీ పాల్గొన్నారు.