V6 News

ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం : మంత్రి సీతక్క

ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం : మంత్రి సీతక్క

ములుగు, వెలుగు : ఇచ్చిన మాట ప్రకారం మల్లంపల్లి మండలం ఏర్పాటు చేసుకున్నామని, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించుకోవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. బుధవారం  మల్లంపల్లిలో ప్రచారం నిర్వహించారు. పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలదేనన్నారు. అనంతరం గ్రామానికి చెందిన గొర్రె జంపయ్య ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందగా, కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. 

కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్​ కొండం రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్​ శ్రీకాంత్​ రెడ్డి, బీసీ సెల్​ జిల్లా అధ్యక్షుడు వంగ రవియాదవ్, కాంగ్రెస్​ గ్రామ అధ్యక్షుడు చందా రాము, రవిబాబు, రామకృష్ణారెడ్డి, రాంరెడ్డి, ఎడ్ల కరుణాకర్ రెడ్డి, గణేశ్​రెడ్డి, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని పందికుంట, కుమ్మరిపల్లి గ్రామాల్లో మంత్రి ప్రచారం నిర్వహించారు.