హరీష్ రావు నీచమైన స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు: మంత్రి సీతక్క

హరీష్ రావు నీచమైన స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు: మంత్రి సీతక్క

మాజీ మంత్రి హరీష్ రావుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా గురువారం ( అక్టోబర్ 16 ) జరిగిన క్యాబినెట్ లో ఎలాంటి రాద్ధాంతం జరగలేదని అన్నారు. క్యాబినెట్లో రాద్ధాంతం జరిగిందని హరీష్ రావు నిరూపించగలడా అంటూ ప్రశ్నించారు సీతక్క.క్యాబినెట్ ఎజెండా, ప్రజల సమస్యలు తప్పా ఇంకేమీ చర్చ జరగలేదని.. జరగని విషయాలను జరిగిందని మాట్లాడి హరీష్ రావు దిగజారిపోయారని అన్నారు. హరీష్ రావు నీచమైన స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు సీతక్క.

నిన్న ఇండివిజువల్ గా సీఎం తో మాట్లాడినపుడు కూడా ఇతర మంత్రుల మీద చర్చ చేయలేదని అన్నారు సీతక్క. రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీనే  అని అన్నారు. అబద్ధానికి ఆర‌డుగుల‌ సాక్ష్యం హరీష్ రావు అన్ని అన్నారు సీతక్క. బీఆర్ఎస్  ప్రభుత్వంలోనే రోడ్లపై అడ్వకేట్లను చంపిందని అన్నారు. దండుపాళ్యం, దండుకున్న పాళ్యం బీఆర్ఎస్ పార్టీనే అని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ ఫాం హౌజ్ కి పరిమితమైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన అందిస్తున్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో తూ తూ మంత్రంగా క్యాబినెట్ సమావేశాలు జ‌రిగేవని.. కేసీఆర్ బయటకి రాకపోయేవారని అన్నారు. హరీష్ రావుపై  కేసీఆర్ కూతురు అనేక విషయాలను బయట పెట్టిందని.. కవిత ఆరోపణలపై హరీష్ సమాధానం చెప్పాలని అన్నారు సీతక్క.