కామాఖ్య మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

కామాఖ్య మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న థ్రిల్లర్  చిత్రం ‘కామాఖ్య’.  వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను మంత్రి సీతక్క లాంచ్ చేసి టీమ్‌‌‌‌ను అభినందించారు. 

ఇంటెన్స్, థ్రిల్లింగ్‌‌‌‌గా ప్రజెంట్ చేసిన ఫస్ట్ లుక్‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. డైరెక్టర్ అభినయ కృష్ణ ఈ సినిమా కోసం మిస్టీరియస్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌‌‌‌తో యూనిక్ కథని సిద్ధం చేశాడు.  ఆనంద్, శరణ్య ప్రదీప్, ధనరాజ్, రాఘవ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గ్యానీ  సంగీతం అందిస్తున్నాడు.