సీఎం రేవంత్కు రాఖీ కట్టిన మంత్రి సీతక్క

సీఎం రేవంత్కు రాఖీ కట్టిన మంత్రి సీతక్క

తెలుగు రాష్ట్రాల్లో రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.అన్నాచెల్లెళ్లు..అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగగా జరుపుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు. ఆయన ఇంటికి వెళ్లిన సీతక్క రేవంత్ కు ఆయన మనవడికి రాఖీ కట్టి స్వీట్ తినిపించారు. ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, రాగమయి, కార్పొరేషన్ ఛైర్మన్లు శోభారాణి,శారద, సుజాత రేవంత్ కు రాఖీ కట్టారు.

రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడ శాసనసభ్యులు,రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ కు  వారి స్వగృహంలో తన సోదరి లీలా రాఖీ కట్టి స్వీట్స్ తినిపించారు..అన్న చెల్లెళ్ళ అనుబంధం,ఆత్మీయ అనురాగలకు మారు పేరు రాఖీ పౌర్ణమి పండుగ అని ప్రభుత్వ విప్ అన్నారు.. సోదర సోదరీమణులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు..

పలువురు కార్పొరేటర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ముస్లిం మహిళలతో పాటు, నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మహిళలు  ఎమ్మెల్యే దానం నాగేందర్ కు  రాఖీ కట్టారు.

కరీంనగర్ చైతన్యపురిలోని బండి సంజయ్ నివాసంలో ఘనంగా  రక్షాబంధన్ వేడుకలు  జరిగాయి.  బండి సంజయ్ కు  ఆయన అక్కా చెళ్లెళ్లు, బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ రాఖీ కట్టి స్వీట్ తినిపించారు.