ఉపాధి హామీ నిధులు పెంచండి : మంత్రి సీతక్క

ఉపాధి హామీ నిధులు పెంచండి : మంత్రి సీతక్క
  • కేంద్ర మంత్రి చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంత్రి సీతక్క వినతి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిధులను పెంచాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌తో ఆమె భేటీ అయ్యారు. గతేడాది 12 కోట్ల పని దినాలు మంజూరు చేసిన కేంద్రం.. ఈ సారి 6.5 కోట్ల పని దినాలకే పరిమితం చేసిందని సీతక్క గుర్తుచేశారు. దీంతో గ్రామీణాభివృద్ధికి ఆటంకం కలుగుతోందన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు ఉపాధితోపాటు మౌలిక సదుపాయాలు అందిస్తున్నామన్నారు. 

ఉపాధిపై ఆంక్షలు లేకుండా నిధులను పెంచాలని కోరుతూ వినతిపత్రాన్ని కేంద్ర మంత్రికి అంద‌‌‌‌‌‌‌‌జేశారు. సీత‌‌‌‌‌‌‌‌క్క విజ్ఞప్తికి కేంద్ర మంత్రి పెమ్మసాని సానుకూలంగా స్పందించారు. సీతక్కతోపాటు మంత్రి పొన్నం ప్రభాక‌‌‌‌‌‌‌‌ర్, గ్రేటర్ వ‌‌‌‌‌‌‌‌రంగ‌‌‌‌‌‌‌‌ల్ మేయ‌‌‌‌‌‌‌‌ర్ గుండు సుధారాణి, ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్  ఉన్నారు. 

డీఎంకే ఎంపీ కనిమొళిని కలిసిన సీతక్క

ఢిల్లీలో డీఎంకే ఎంపీ కనిమొళిని మంత్రి సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరు రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాల వివరాలను ఇరువురు నేతలు తెలుసుకున్నారు. కనిమొళి సీతక్కను తమిళనాడుకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీతక్క ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.