మేడారంలో పర్యటించిన మంత్రి సీతక్క

మేడారంలో పర్యటించిన మంత్రి సీతక్క

తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఆదివారం మంత్రి సీతక్క పర్యటించారు. ముందుగా పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు కూతురు ఐలబోయిన అశ్విని, అల్లుడు శ్రావణ్ కుమార్​ గృహప్రవేశానికి హాజరయ్యారు. అనంతరం హరిత హోటల్​లో మేడారం ట్రస్ట్  బోర్డ్  చైర్మన్  అరేం లచ్చు పటేల్  బర్త్​ డేలో పాల్గొని కేక్  కట్  చేశారు.

 ఎలుబాక గ్రామానికి చెందిన బీఆర్ఎస్  నాయకులు కాంగ్రెస్ లో చేరగా, వారికి కాంగ్రెస్  కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న మాస్టర్  ప్లాన్  పనులను పరిశీలించారు. 

సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు, గద్దెల పునర్నిర్మాణ పనులను స్పీడప్​ చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఎండోమెంట్  ఈవో వీరస్వామి, ములుగు ఏఎంసీ చైర్మన్  రేగ కల్యాణి, మేడారం ట్రస్ట్  బోర్డ్  చైర్మన్  అరేం లచ్చు పటేల్, కాంగ్రెస్  నేతలు బొల్లు దేవేందర్  పాల్గొన్నారు.

నూతన గృహప్రవేశానికి హాజరైన మంత్రి సీతక్క

తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల పూజల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, కూతురు ఐలబోయిన అశ్విని, అల్లుడు శ్రవణ్ కుమార్​ మేడారంలో నూతనంగా నిర్మించుకున్న గృహప్రవేశానికి ఆదివారం మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిబ్బన్ కట్ చేసి నూతన గృహప్రవేశాన్ని ప్రారంభించారు.  కార్యక్రమంలో ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అరెం లచ్చు పటేల్,  పూజారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.