పార్టీలోకి వస్తా అంటే ఎవరైనా వద్దంటారా : మంత్రి శ్రీధర్ బాబు

పార్టీలోకి వస్తా అంటే ఎవరైనా వద్దంటారా : మంత్రి శ్రీధర్ బాబు

ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పార్టీలోకి వస్తామని అంటే.. ఎవరైనా వద్దంటారా అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. రవీంధ్రభారతిలో తెలంగాణ సంగీత నాట్య అకాడమీ అధ్యక్షురాలిగా ఆలేఖ్య పుంజాల బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా ఐటీ శాఖమంత్రి శ్రీధర్ బాబుతోపాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. గతంలో మా ఎమ్మెల్యేలను భయపెట్టి.. కేసీఆర్ బీఆర్ఎస్ లో చేర్చుకున్నారని చెప్పారు.. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ లోకి వస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఉంది కాబట్టే జాయినింగ్స్ కొనసాగుతున్నాయన్నారు శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని.. చివరికి బీఆర్ఎస్ లో మిగిలేది ఆ నలుగురే అని మంత్రి శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు.

Also Read:రియల్ ఎస్టేట్ వ్యాపారి కమ్మరి కృష్ణ హత్య కేసులో.. ఇద్దరు కొడుకుల విచారణ