హైదరాబాద్ సిటీలో పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తింపు పొందిన కమ్మరి కృష్ణను కొందరు దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే. షాద్ నగర్ లోని తన ఫాంహౌస్ నుంచి బయటకు వస్తున్న సమయంలో.. ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి.. కిరాతకంగా నరికి చంపారు. కమ్మరి కృష్ణను చంపిన తర్వాత.. అక్కడి నుంచి నిందితులు పరార్ అయ్యారు.
ఘటనపై రెండో భార్య విజయలక్ష్మి చెప్పిన వివరాల ప్రకారం.. తాము ఫాం హౌజుకు వెళ్లినప్పుడు తమ డ్రైవర్ బాబా కృష్ణ కాళ్లు గట్టిగా పట్టుకున్నాడని ఈ క్రమంలోనే ఇద్దరు వ్యక్తులు వచ్చి దారుణంగా పీక కోసి చంపారని చెప్పింది. దీంతో ఆ ఇద్దరు ఎవరా అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు.. దర్యప్తు చేస్తున్న పోలీసులు కమ్మరి కృష్ణ హత్య కేసు విచారణలో భాగంగా కృష్ణ కుమారుడు శివ, అతని మిత్రుడు సుజిత్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సుజిత్ ప్రస్తుతం హైదర్ షా కోట్ ఇంటి దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది.
Also Read:న్యూయార్క్ టైమ్స్ స్క్వైర్ తరహాలో..హైదరాబాద్ లో వీడియో బిల్ బోర్డులు